ఓందుట్ల గ్రామంలో సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన

గడివేముల ఎస్సై బీటీ. వెంకటసుబ్బయ్య

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలోని ఓందుట్ల గ్రామంలో గ్రామపంచాయతీ వారు నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు ముఖ్యఅతిథిగా గడివేముల ఎస్సై బీటీ వెంకటసుబ్బయ్య హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని, రాగద్వేషాలకు తావి వ్వకుండా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు.


అనంతరం సంక్రాంతి పండగ సంబరాల్లో  భాగంగా గ్రామంలోని మహిళలకు ముగ్గుల పోటీలను,పురుషులకు కబడ్డీ పోటీలు మరియు బాలలకు  మ్యూజికల్ చైర్ పోటీలను నిర్వహించారు. ఓందుట్ల గ్రామంలోని ప్రజలు భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు.ఈ పోటీలలో పాల్గొని విజేతలైన వారికి గడివేముల ఎస్సై బీటి.వెంకటసుబ్బయ్య  ప్రథమ,ద్వితీయ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓందుట్ల సర్పంచ్ గంగాధర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది చెన్నయ్య, హిమాంసాఓందుట్ల గ్రామంలోని మహిళలు,పురుషులు, పిల్లలు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: