గ్రామాలలో కక్ష సాధింపులు సరికాదు

శ్రీశైలం మాజీ శాసనసభ సభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండల పరిధిలోని అమలాపురం, కృష్ణాపురం గ్రామంలో క్రీడలపై ఆసక్తి తో మిలటరీకి వెళ్లి వచ్చిన అమరనాథ్, ఆంజనేయులు అను ఇరువురు యువకులు తమ సొంత ఖర్చులతో ఐదు లక్షలు ఖర్చుచేసి గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన భూములలో యువకులు క్రీడలను ఆడుకునేందుకు వీలుగా ఆట స్థలము ఏర్పాటు చేయగా కొంతమంది గ్రామానికి చెందిన కొందరు నాయకులు ఆట స్థలము ఏర్పాటు చేసిన భూములలో ఎవరు ఆడుకోరాదని టాక్టర్ తో భూమిని దున్నించి పాడు చేయడంతో పాటు వారిని ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని,గతంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారి అనుమతి తీసుకొని వెంకటేశ్వర స్వామి దేవస్థాన భూములలో  విద్యార్థులు ఆడుకోవడానికి చదును చేసిన భూమి ఆ దేవస్థానం స్వామి వారి పేరు పెట్టి ఆట స్థలముగా  మార్చారని అందులో తప్పేముందని తెలుగుదేశం పార్టీ నాయకులు బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు.


కొంతమంది నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఎదుగుదలకు కారణమైన ఆట స్థలమును పాడుచేసి పైసాచిక ఆనందం పొందుతున్నారని, కొంతమంది నాయకులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూములకు కంచెలు వేసుకున్న వారిని వదిలేసి విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఉపయోగపడే ఆట స్థలమును పాడు చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం మరియు కృష్ణాపురం పెద్ద స్వామి రెడ్డి,శివారెడ్డి, రామలింగేశ్వర రెడ్డి, భూపడు తెలుగుదేశం కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: