నంద్యాలలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు యాదవ్ కు ద్దతుగా...

 విస్తృతప్రచారం చేసిన..... బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య,డివైఎఫ్ఐ

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పోతుల నాగరాజు యాదవ్ గారికి మద్దతుగా బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎస్పిజి గ్రౌండ్,ఎల్ఐసి ఆఫీస్,రైల్వే స్టేషన్, పాలిటెక్నికల్ కాలేజ్, ఎమ్మార్వో ఆఫీస్,రిజిస్టర్ ఆఫీస్,ట్రెజరీ ఆఫీస్లలో మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో డాక్టర్ పోతుల నాగరాజు యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు యూటీఎఫ్, ఎస్టియు ఉపాధ్యాయ, ఉద్యోగ కార్మిక ప్రజాసంఘాలు, జన విజ్ఞాన వేదిక రూటా ఆర్పిఎస్, ఆర్ఈఎఫ్, రచయితలు,మేధావులు అందరి మద్దతుతో పోటీ చేస్తున్నారని,2007లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కేవలం 454 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగిందని,


సమస్యలపై నిరంతరం కృషి చేస్తు ప్రజా ఉద్యమాలలో పనిచేస్తున్నారని,2023 వ సంవత్సరం మార్చిలో జరగబోయే ఎమ్మెల్సీ పట్టభద్రులు ఎన్నికల్లో అందరి మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు పెరుగు శివకృష్ణ.డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్,టౌన్ కార్యదర్శి శివ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య నాయకులు రాజేష్, మహేష్.బీసీ సంఘం నాయకులు మిద్దె వెంకట నాయుడు, వాల్మీకి శ్రీనివాసులు,అనిల్, మనోహర్,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: