ఉచిత టైలరింగ్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి
సర్టిఫికెట్లను అందజేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వర ప్రతినిధి)
రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత టైలరింగ్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని జల్పల్లి మున్సిపాలిటీ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పి.సబితా ఇంద్రారెడ్డి రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరిగిన SHE ERA (Empowering rural Aaspirants) కార్యక్రమంలో భాగంగా ఉచిత టైలరింగ్ ట్రైనింగ్ పూర్తి చేసిన మహిళల అందరికీ సర్టిఫికెట్లు అందచేశారు.
ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీస్ కమిషనర్ డీ.ఎస్.చౌహన్ (ఐపీఎస్) డీఎస్పీ సన్ ప్రీత్ సింగ్( ఐపీఎస్) రాచకొండ డిసిపి షీటీం షేక్ సలీమా (ఐపీఎస్) వనస్థలిపురం ఏసిపి పురుషోత్తం రెడ్డి, పహడి షరీఫ్ సీఐ కిరణ్ కుమార్, జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాది ,జల్పల్లి మాజీ సర్పంచ్ రంగారెడ్డి జిల్లా సర్పంచ్ అధ్యక్షులు ప్రస్తుత జల్పల్లి మున్సిపాలిటీ సభ్యులు. సూరెడ్డి కృష్ణారెడ్డి, జల్పల్లి మున్సిపాలిటీ రిప్రజెంటేటివ్ వైస్ చైర్మన్ యూసుఫ్ పటేల్, వర్కింగ్ ప్రెసిడెంట్ యంజాల జనార్దన్, గౌరవ్ మున్సిపల్ కమిషనర్ వసంత, గౌరవ కౌన్సిలర్స్, అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: