గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న బుక్క వేణుగోపాల్

పలు చోట్ల జెండా ఆవిష్కరణ

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్ర నగర్ ప్రతినిధి)

“భారత దేశ 74వ గణతంత్ర దినోత్సవం”ను పురష్కరించుకొని బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ రాజేందర్ నగర్, రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాలలో పాలుపంచుకొని జాతీయ జెండాను ఎగరవేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో, శంషాబాద్ మండల అంబెడ్కర్ విగ్రహం బిజెపి జెండా వద్ద, మైలార్దేవ్ పల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్ డివిజన్ లలో, శంషాబాద్ మండలంలోని పలు గ్రామపంచాయితీ కార్యాలయాల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ తన నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో కలిసి జాతీయ పతాక ఆవిష్కరణలో కార్యక్రమాలలో పాల్గొన్నారు.


 ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహా రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు డా. ప్రేమ్ రాజ్, అందేల శ్రీరాములు యాదవ్, జిల్లా ఓబీసీ మోర్చ కార్యదర్శి నాన్నవాళ్ళ కుమార్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు నంద కిశోర్, శంషాబాద్ అర్బన్ అధ్యక్షులు కొనమొల దేవేందర్, నర్కూడ సర్పంచ్ సునిగంటి సిద్దులు, ఎంపీటీసీ తొంట గౌతమి అశోక్, వార్డ్ సభ్యులు, బీజేపీ, బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: