పోసాని సురేందర్ ముదిరాజ్ కు జాతీయ ఐక్యత అవార్డు

మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య చేతుల మీదగా అందజేత

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

 పాతబస్తీ లాల్ దర్వాజాకు చెందిన సింహ వాహిని శ్రీ మహంకాళి దేవాలయము చైర్మన్ ( ఫోర్ మెన్ కమిటీ) పోసాని సురేందర్ ముదిరాజ్ కు జాతీయ ఐక్యత అవార్డు వచ్చినట్లు   తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రాజ్ నారాయణ్ తెలిపారు. పోసాని సురేందర్ ముదిరాజ్ కు ఈ జాతీయ ఐక్యత అవార్డును మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అందచేశారు. ఆబిడ్స్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్తు ఆడిటోరియంలో ఈ అవార్డును ప్రధానం చేశారు. ఇధిలావుంటే పోసాని సురేందర్ ముదిరాజ్ విద్యార్ధి సంఘాల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో ర్యాలీలు ,


సదస్సులు చేపట్టి  పాతబస్తీ లోని ప్రజల మన్నలను పొందారు. దేవాలయ కార్యక్రమాల   పోసాని సురేందర్ ముదిరాజ్ సేవలను గుర్తించి ఈ ఏడాది స్వామి వివేకానంద జయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, బాసర ఆర్ జి కే యు టి ఇన్చార్జి ఫార్మర్ వైస్ ఛాన్స్ లర్, మాజీ ఇంటర్ బోర్డు కమిషనర్ ఐఏఎస్ డాక్టర్ ఎ. అశోక్, ఇతర మేధావులు పాల్గొన్నారు.

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: