ఎవరికీ తలవంచలేదు... ఇకపైనా వంచబోను: కడియం శ్రీహరి
తప్పు చేసినవాడే తలవంచుతాడు... నేను ఇంతవరకు రాజకీయాల్లో ఎవరికీ తలవంచలేదు... ఇకపైనా తలవంచబోను అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీనియర్ రాజకీయవేత్త కడియం శ్రీహరి పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఎవరికీ పాదాభివందనం చేయలేదని స్పష్టం చేశారు. ఆర్జించడం కాదు ఆత్మగౌరవంతో నిలబడాలి అని కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు ఆయన ఎవరిని ఉద్దేశించి చేశారో స్పష్టత లేదు. కడియం శ్రీహరికి, ఎమ్మెల్యే రాజయ్యకు విభేదాలున్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Home
Unlabelled
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: