ఏపి మోడల్ స్కూల్,కస్తూరిబా స్కూల్,గర్ల్స్ హాస్టల్ లకు రహదారి వేయరా
ప్రశ్నించిన ఆర్వీఎఫ్, ఏఐఎఫ్బీ విద్యార్థి సంఘాలు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని స్థానిక పాణ్యంలోని మోడల్ స్కూల్,కాలేజీ, లకు రహదారి వేయరా అని రాయాసీమ విద్యార్ధి ఫెడరేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షులు బత్తినిప్రతాప్, అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు వనము వెంకటాద్రిలు డిమాండ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2016 లో ఏపీ మోడల్ స్కూల్ పాఠశాల ఏర్పాటు చేశారని,పాఠశాలకు వెళ్లడానికి రహదారి,ప్రహరీ గోడ నిర్మించకుండా గాలికి వదిలేసారని,విద్యార్థులకు భద్రత లేకపోవడంతో భయంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే భయంతో చదువుకుంటు న్నారని,గత ఆరు సంవత్సరాలనుండి ఇప్పటి వరకు పాఠశాలకు, కాలేజీలకు రహదారి మరియు ప్రహరీ గోడ నిర్మించాలని విద్యార్థి, యూవజన, ప్రజాసంఘాలు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ధర్నాలు చేసిన అధికారులు నిర్మిస్తామని హామీ ఇచ్చి హామీలను గాలికి వదిలి వేస్తున్నారని, అధికారులు, ప్రజా ప్రతినిధుల హామీలు వలన ఆశలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా
మిగిలిపోతున్నాయని, ఆరు సంవత్సరాలనుండి గ్రామస్తులు మధ్యలో ఉన్న రహదారితో అనునిత్యం గ్రామస్తులతో విద్యార్థులు గొడవలు పడుతూ వెళ్ళుతున్నారని, మోడల్ స్కూల్ మరియు కాలేజీలో దాదాపుగా 2000 మంది విద్యార్థులు,60మంది ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు గులకరాళ్ల మరియు కంకర రాళ్లమధ్య 1/2 కీలో దూరం కాలినడక తో నడుచుకుంటూ వెళ్ళాలని, రహదారి వెంట ఏ వాహనం పోవడానికి మరియు రావడానికి వీలు లేకుండా ఉందని,ఇదేమిటని విద్యార్థి సంఘాలు అడిగితే వారి మీద కేసులుతో, బెదిరింపులతో గురి చేస్తున్నారని,గత 7 సంవత్సరాల నుండి ఇప్పటిదాకా ఎన్నోసార్లు ఎమ్మెల్యే, ఎంపీడీఓ, ఎమ్మార్వో అధికారులను కలిసామని, అధికారులను కలిసిన ప్రతిసారి ఒక వారం లేదా నెల రోజులలో రహదారి పనులు చేస్తామని హామీ ఇచ్చి,
హామీలు ఉచిత హామీలుగానే మిగిలిపోయాయని, ఇప్పటికి 7 సంవత్సరాలు అయినా ఏటువంటి కార్యచరణకు నోచుకోకుండా ఉచిత హామీలకే పరిమితం అయిందని,వారం రోజులలోపు రహదారి నిర్మించకుంటే 21 వ తేదీ నుండి ఎమ్మార్వో, కలెక్టర్ ఆఫీసుల ముందు ప్రత్యక్ష నిరాహార దీక్షలకు వందలాది మంది విద్యార్థులతో చేపడతామని హెచ్చరించారు, ఈకార్యక్రమంలో రాయాసీమ విద్యార్ధి జిల్లా కార్యదర్శి రియాజ్ బాషా, కేజే.శ్రీనివాసరావు,బత్తిని ప్రతాప్,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Home
Unlabelled
ఏపి మోడల్ స్కూల్,కస్తూరిబా స్కూల్,గర్ల్స్ హాస్టల్ లకు రహదారి వేయరా,,,,ప్రశ్నించిన ఆర్వీఎఫ్, ఏఐఎఫ్బీ విద్యార్థి సంఘాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: