దివంగత సీనియర్ జర్నలిస్ట్ జావిద్ అలీ ఖాన్ కు ..

లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయ ప్రతినిధుల ఘన నివాళులు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయ ఆవరణలో పాతబస్తీకి చెందిన దివంగత సీనియర్ జర్నలిస్ట్ జావిద్ అలీ ఖాన్ కు సంతాపంగా దేవాలయ ప్రతినిధులు నివాళులర్పించారు. శనివారం నాడు ఫోర్ మెన్ కమిటీ సభ్యుడు శీరా రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఆలయ ప్రతినిధులు దివంగత జర్నలిస్ట్ జావిద్ అలీఖాన్ చిత్రపటానికి పూలమాల వేసి, కొవ్వొత్తులు వెలిగించి సంతాపం పాటించారు. జర్నలిస్టుగా జావిద్ అలీ ఖాన్ పాతబస్తీ చేసిన సేవలు వెలకట్టలేనివని ఈ సందర్భంగా దేవాలయ ప్రతినిధులు పేర్కొన్నారు. జర్నలిస్టు మృతి ప్రతికారంగానికి తీరనిలోటని వారు వెల్లడించారు. జర్నలిస్ట్ జావిద్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులకు వారు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు లక్ష్మీనారాయణ గౌడ్, మాణిక్ గౌడ్, విష్ణు గౌడ్, మారుతి యాదవ్, అర్జున్ యాదవ్, అరవింద్ యాదవ్, వంశీ యాదవ్, రాకేష్ యాదవ్, చంద్ర కుమార్, శ్రీనివాస్ యాదవ్, ప్రవీణ్, రోషన్, యశ్వంత్,  తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: