నంద్యాల జిల్లాలో... ఘనంగా అహోబిలం తిరణాల మహోత్సవాలు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని అహోబిలం దేవస్థానంలో 24-02-23 వ తేదీ జరుగు అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా 10-01-23 నుండి అహోబిలం శ్రీ లక్ష్మి నరసింహస్వామి కొండ దిగి ఆళ్లగడ్డ మండలంలోని 34 గ్రామాలలో అహోబిల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి తన వివాహ కార్యక్రమానికి రావాలని ప్రజలను ఆహ్వానిస్తూ గ్రామ గ్రామాలలోని తెరిపెల (అరుగుల) మీద కూర్చుని భక్తులకు దర్శనం ఇచ్చి ఆహ్వానిస్తున్నారు.స్వామి వారు వెళుతున్న ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొల్పుతున్నారు. గ్రామంలో తేరిపలు (అరుగుల) మీద కూర్చున్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారికి గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని ఆహ్వానిస్తున్నారు.
24-02- 2023 అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం జరుగుతున్న సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తిరుగుతున్న 34 గ్రామ్మాల్లో స్వామి వారు వెళుతున్న గ్రామంలోని ప్రతి ఇల్లు దూర ప్రాంతాల నుండి వచ్చిన బంధు వర్గంతో కళకళలాడుతూ ఆనందంతో ప్రజలు తిరుణాల పండుగను జరుపుకుంటున్నారు.
Home
Unlabelled
నంద్యాల జిల్లాలో... ఘనంగా అహోబిలం తిరణాల మహోత్సవాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: