కేసీఆర్  ప్రత్యేక కృషితో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

మహేశ్వరం నియోజకవర్గానికి కొనసాగుతున్న నిధుల వరద

బడంగ్ పేట్,మీర్ పేట్ కార్పొరేషన్ల పరిధిలో సెంట్రల్ లైటింగ్, వీధి దీపాలు,చెరువుల సుందరికరణకు 11 కోట్ల 36 లక్షలు మంజూరు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్,మీర్ పేట్ కార్పొరేషన్ల పరిధిలో సెంట్రల్ లైటింగ్,ఇతర అభివృద్ధి పనులకు 11 కోట్ల 36 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువు సుందరికరణ కు రెండు కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. అదేవిధంగా కోటి రూపాయలతో మంత్రాల చేరువులో లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.బడంగ్ పేట్ క్రాస్ రోడ్ నుండి సి కె ఆర్ & టికేఆర్  మీదుగా బాలాపూర్ రోడ్డు వరకు 30 లక్షలతో, బాలాపూర్ క్రాస్ రోడ్డు నుండి నాదార్గుల్ ప్రభుత్వ పాఠశాల వరకు రెండు కోట్ల 50 లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు నిధులు మంజూరు అయ్యాయన్నారు. కోటి 20 లక్షలతో నూతన బడంగ్ పేట్ మునిసిపల్ కార్యాలయం నుండి గుర్రం గూడ క్రాస్ రోడ్డు వరకు, 45 లక్షలతో బడంగ్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో అయ్యంగార్ బేకరీ నుండి అల్మాస్ గూడ కమాన్ వరకు,  50 లక్షలతో కోమటికుంట చెరువు నుండి బి ఎన్ రెడ్డి వరకు వీధి దీపాల ఏర్పాటుకు నిధులు విడుదల అయ్యాయని అన్నారు. మల్లాపూర్ క్రాస్ రోడ్డు నుండి కుర్మల్ గూడ, నాదార్గుల్ మీదుగా గుర్రంగూడా వరకు ఒక కోటి 50 లక్షలతో వీధి దీపాలు, మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలో స్వాగత్ గ్రాండ్ హోటల్ నుండి నందన వనం వరకు 37 లక్షలతో, అంబెడ్కర్ విగ్రహం నుండి అల్మాస్ గూడ వరకు 78 లక్షలతో, ప్రశాంతి హిల్స్ నుండి విజ్ఞానపూరి కాలనీ వరకు 76 లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. మొత్తం 11 కోట్ల 36 లక్షల నిధులతో ఆయా పనులు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: