జల్పల్లి మున్సిపాలిటీలో,,,బీజేపీ..కాంగ్రెస్ పార్టీకి షాక్

మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో,,,గులాబీ కండువ కప్పుకొన్న ఇరు పార్టీల నేతలు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

జల్పల్లి మున్సిపాలిటీలో,,,బీజేపీ..కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఇరు పార్టీలకు చెందిన పలువురు నేతలు గులాబీ కండువ కప్పుకొన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ కాలనీలలో  మరింత అభివృద్ధి జరగాలంటే కేవలం సబితా ఇంద్రారెడ్డితోనే సాధ్యమని గ్రహించి మంత్రివర్యుల సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నట్లు వారు వెల్లడించారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో  జల్పల్లి పురపాలక సంఘం జల్పల్లి శ్రీరామ కాలనీకి చెందిన బిజెపి, కాంగ్రెస్ కాలనీ వాసులు మంగళవారంనాడు యువ నాయకులు యంజాల అర్జున్ ఆధ్వర్యంలో 40 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని బీఆర్ఎస్ లోకి సాధారంగా ఆహ్వానించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీ కండువ కప్పారు.


కాలనీల అభివృద్ధి కేవలం మంత్రి  సబితా ఇంద్రరెడ్డితోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలు వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న ఒక మహిళ మంత్రిగా  నియోజకవర్గాన్ని తన ఇంటి గా   భావించి అనునిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజల కోసం పాటుపడే మంత్రి సబితా ఇంద్రా రెడ్డి  సేవలు మరువలేక పార్టీలోకి రావడం జరుగుతుంది అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి మాజీ సర్పంచ్, మాజీ రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు ప్రస్తుత జల్పల్లి మున్సిపాలిటీ  కో ఆప్షన్ సభ్యులు సూరెడ్డి కృష్ణారెడ్డి, జల్పల్లి మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు దూడల శ్రీనివాస్ గౌడ్ , జల్పల్లి మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చందనం రాజేష్, గౌరవ కౌన్సిలర్స్  కే. లక్ష్మీనారాయణ , పల్లపు శంకర్  పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: