నందమూరి తారకరత్న ఆరోగ్యంగా తిరిగి రావాలని

బీజేపీ  నేత  బుక్క క్రిష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్ర నగర్ ప్రతినిధి)

సినీ హీరో నందమూరి తారకరత్న ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చ కార్యనిర్వాహక సభ్యులు బుక్క క్రిష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్తమి త్రులైన "నందమూరి తారక రత్న"కు ఆసుపత్రిలో అందిస్తున్న వైద్యానికి తోడుగా అభయ ఆంజనేయ స్వామివారి రక్షణతో త్వరాగా కోలుకొని ఆరోగ్యంగా తిరిగి రావాలని ఈ సందర్భంగా బుక్క క్రిష్ణ కోరుకొన్నారు. నందమూరి తారకరత్న అందరి మధ్యలో చిరునవ్వుతో తిరగాలని "అమ్మపల్లి అభయ ఆంజనేయ స్వామివారికి బుక్క క్రిష్ణ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కనకమామిడి విష్ణు ముదిరాజ్, కనకమామిడి కిట్టు ముదిరాజ్, బురుకుంట నాగేష్, భాస్కర్, వరప్రసాద్, తేజ, బుక్క క్రిష్ణ మిత్ర బృందం పాల్గొన్నారు.



 



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: