మన్నెగూడ గ్రామానికి నేడు సబితా ఇంద్రారెడ్డి రాక

చనిపోయిన కుటుంభాలకు పరామర్శ

(జానో జాగో వెబ్ న్యూస్-పరిగి ప్రతినిధి)

పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలం మన్నెగూడ గ్రామానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారంనాడు రానున్నారు. కోటిపల్లి ప్రాజెక్టులో మునిగి చనిపోయిన కుటుంబాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించనున్నారు. ఇదిలావుంటే వికారాబాద్ జిల్లాలోని కోటిపల్లి ప్రాజెక్టులో మునిగిపోయి నలుగురు యువకులు మృతి చెందారు. సరదా కోసం ఈతకు వెళ్లిన యువకులు మృత్యువాత పడటంతో ఆ కుటుంబాన్ని చీకటి కమ్మేసింది. మన్నెగూడకు చెందిన ఒకే కుటుంభానికి చెందిన నలుగురు యువకులు కేశవ్ (28), జగదీష్(24), రాజేష్(24), వెంకటేష్(25) కలిసి కోటిపల్లి ప్రాజెక్టుకు విహారయాత్రకు వచ్చారు. సరదా కోసం ఈత కొడదామని నీటిలో దూకారు. అయితే.. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో ప్రమాదవశాత్తు ఈ నలుగురు వ్యక్తులు కోటపల్లి ప్రాజెక్టులో గల్లంతయ్యారు. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు, రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: