పాణ్యం మోడల్ స్కూల్లో... విద్యార్థినీ విద్యార్థులకు రక్షణ ఎక్కడ
రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ నేతల ప్రశ్న
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం మండల పరిధిలోని సుగాలిమెట్ట వద్దనున్న మోడల్ స్కూల్లో రాయలసీమ స్టూడెంట్ అసోసియేషన్,(అర్ఎస్ఎ) రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్)నేతలు విద్యార్ధిని,విద్యార్ధులతో ముఖాముకి సమావేశం నిర్వహించారు.సమావేశంలో విద్యార్థిని,విద్యార్ధులు పలురకాల సమష్యలు దృష్ఠికి తెచ్చారని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాధ్ , రాయలసీమ స్టూడెంట్ అసోసియేషన్(అర్ఎస్ఎ) జిల్లా అధ్యక్షుడు వెంకట్, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి రియాజ్ లు తెలిపారు.ఈ సందర్బంగా రాయలసీమరవీంద్రనాధ్, వెంకట్, రియాజ్ మాట్లాడుతూ పాణ్యం మోడల్ స్కూల్లో విద్యార్ధులకు సక్రమంగా మెనూ అందిచడం లేదని, బోజనం సరిగ్గా లేదని, హాస్టల్లో విద్యార్ధుల సంఖ్య రెండ్లు రెట్లు వ్రాసుకొని వార్డెను, ప్రిన్సిపాల్ బిల్లులు స్వాహా చేస్తున్నారని, విద్యార్థినిలను హాస్టల్ వార్డెన్ సరిగా పట్టించుకోవడం లేదని, హాస్టల్ వార్డెన్ విద్యార్ధినిల సంరక్షణ మరచి ఎప్పుడూ సెల్ ఫోన్ లో మాట్లాడటం, వాట్సాప్ చూడటం చేస్తుంటుందని,ప్రిన్సిపల్ విద్యార్ధినిలతో అసభ్యకరంగా మాట్లాడుతూ,
వేధింపులకు గురి చేస్తున్నాడని,పిన్సిపల్ అటెండెన్స్ వేసుకొని స్కూలు బయట తిరుగుతుంటాడని విద్యార్ధిని,విద్యార్ధులు నేతలకు చెప్పి వ్రాతపూర్వకంగా వ్రాసి ఇచ్చిన కాగితాలను రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాధ్, రాయలసీమ స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకట్, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి రియాజ్,రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్) పాణ్యం కార్యకర్త బాలకృష్ణ నాయక్ తదితరులు నంద్యాలలోని నంద్యాల జిల్లా విద్యాశాఖాథికారిని అనురాధ గారిని డీఈఓ కార్యాలయంలో కలిసి పాణ్యం మోడల్ స్కూల్లో విద్యార్థినీ,విద్యార్ధులు సమష్యలతో వ్రాసి ఇచ్చిన పేపర్లను అందజేస్తూ పాణ్యం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్,హాస్టల్ వార్డెన్, వాచ్ మెన్ లను తక్షణమే సస్పెండ్ చేసి, విద్యార్ధుల సమష్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. నంద్యాల జిల్లా డీఈఓ అనురాధ సానుకూలంగా స్పందించి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారులపై చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
Home
Unlabelled
పాణ్యం మోడల్ స్కూల్లో... విద్యార్థినీ విద్యార్థులకు రక్షణ ఎక్కడ ,,, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ నేతల ప్రశ్న
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: