ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు పోరుకు సిద్ధం కావాలి
సిపిఎం నేతల పిలుపు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాలజిల్లా ఆత్మకూరు పట్టణంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యేసు రత్నంలు పిలుపునిచ్చారు. ఆత్మకూరు పట్టణంలోని డాక్టర్ ఏ.ధనుంజయ మీటింగ్ హాల్ నందు సిపిఎం పార్టీ జనరల్ బాడీ సమావేశం పట్టణ కార్యదర్శి రణధీర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం యువశక్తిని నిర్విరం చేస్తోందని,ప్రజల ఆస్తులను పకృతి వనరులను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని, అధికారం కోసం ప్రజల మధ్య కుల,మత అడ్డగోడలు నిర్మిస్తుందని,జీఎస్టీ పేరుతో ప్రజల నడ్డి విరిచిందని,పెట్రోలు,గ్యాస్ ధరలు రెట్టింపు చేసిందన్నారు.ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని,రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రంలోని అధికార వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కొమ్మ కాయడం సిగ్గుచేటుని,విద్యారంగంలో బైజుస్ వంటి సంస్థలతో ఒప్పందాలు కార్పొరేట్ శక్తులను బలోపేతం చేయడానికని,ఆర్బికేలు రైతులకు భరోసా కల్పించడం లేదని,ప్రజలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం,రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ మండలకార్యదర్శి నరసింహ నాయక్, నాయకులు సంజీవరాయుడు,మాభాష, స్వాములు, మంజుల, మీనాక్షమ్మ, సురేంద్ర,రామ్ నాయక్,షేక్ ఇస్మాయిల్, సద్దాం,దాసు, చిన్నయ్య, గోపాల్,శివకుమార్, ముర్తుజా,దాసమ్మ, సువర్ణమ్మ,అంబయ్య,రవి తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు పోరుకు సిద్ధం కావాలి..... సిపిఎం నేతల పిలుపు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: