ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో జీరో అకౌంట్ ఓపెన్ 

స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన...ఆంధ్ర ప్రగతి బ్యాంక్ మేనేజర్ వి.జాన్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని స్థానిక గడివేముల మండలంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ గడివేముల శాఖలో ఉచిత ఖాతాలను లబ్ధిదారుల కొరకు ప్రారంభించినట్లు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ వి. జాన్, ఫీల్డ్ ఆఫీసర్ విష్ణు తేజ నాయుడు తెలిపారు. గడివేముల మండలంలోని ప్రజలకు మరియు విద్యార్థిని,విద్యార్థులకు ప్రతి ఒక్కరికి బ్యాంకుతో అనుసంధానం ఉండాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని,


నూతనంగా ఆధార్ కార్డు జిరాక్స్,రెండు ఫోటోలు తీసుకువచ్చిన దాదాపు 150 మంది లబ్ధిదారుల ఖాతాలను ప్రారంభించామని,దాదాపు 50 మంది లబ్ధిదారులు ఫిక్స్ డిపాజిట్ చేశారని, నూతనంగా బ్యాంకుతో అనుసంధానంగా ఖాతా ప్రారంభించిన గడివేముల మండలం గ్రామ ప్రజలందరికీ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వి. జాన్, ఫీల్డ్ ఆఫీసర్ విష్ణు తేజ నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు సిబ్బంది మరియు గడివేముల మండలం గ్రామ ప్రజలు, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: