టిడిపి పార్టీకి భారీ షాక్ ...
500 మంది వైఎస్ఆర్సిపి పార్టీలోకి ఆహ్వానించిన....
శ్రీశైలం శాసనసభ సభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా స్థానిక ఆత్మకూరు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీశైలం టిడిపి ముఖ్య నాయకుడు టిఎండి రఫీ 500 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా టిఎండి రఫీ మాట్లాడుతూ పేద ప్రజల పెన్నిధి, ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో దిగ్విజయంగా సాగుతున్న సంక్షేమ పాలనకు జనాకర్షణ ఏ మాత్రం తగ్గడం లేదని,అధినేత బాటలో అడుగులో అడుగు వేస్తూ ప్రజల హృదయాలను దోచుకున్న నేత మన ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి గారని,గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నేనున్నాను అంటూ భరోసా ఇచ్చే శిల్పన్న వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రజలందరినీ కలుపుకొని అభివృద్ధి,సంక్షేమ ఫలాలను ప్రజలకు అందజేయడానికి,ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి వెంట నడుస్తామని,
శీల్పా చక్రపాణి రెడ్డి గారి ప్రభంజనంతో శ్రీశైలం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదని,రాబోయే ఎన్నికల్లో వైసిపి పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ టిఎండి రఫీ అనుచర వర్గం వైసీపీలోకి రావడం శ్రీశైలం నియోజకవర్గం లో వైసీపీకి తిరుగులేకుండా పోయిందని వెంట వచ్చిన సుమారు 500 మంది కార్యకర్తలను వైసిపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Home
Unlabelled
టిడిపి పార్టీకి భారీ షాక్ ... 500 మంది వైఎస్ఆర్సిపి పార్టీలోకి ఆహ్వానించిన.... శ్రీశైలం శాసనసభ సభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: