ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ డిపాజిట్లపై,,,అవగాహన కార్యక్రమం

సారథ్యం వహించిన బ్యాంక్ గడివేముల శాఖ మేనేజర్ వి.జాన్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి) 

నంద్యాల జిల్లా పాణ్యం మండల పరిధిలోని స్థానిక గడివేముల ఆంధ్ర ప్రగతి గ్రామీణబ్యాంకు గడివేముల శాఖ మేనేజర్ వి.జాన్ గారి అధ్యక్షతన పొదుపు మహిళా సంఘం సభ్యులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు నందు 670... పొదుపు సంఘాలు ఉన్నాయనీ,ఈ సంఘాలకు 25000₹ నుండి 20.00.000 రూపాయలు ఎటువంటి పుచ్చికత్తు లేకుండా మహిళలు చైతన్యం కావడానికి,మహిళ సంఘాలకు ఆదాయo పెంచుకోవడానికి రుణాలను మంజూరు చేస్తున్న ఏకైక బ్యాంకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు అని,బ్యాంకు నందు వ్యవసాయ రుణాలు,రైతులకు ట్రాక్టర్ లు మరియు పంట కోత  సామాగ్రి సంబందించిన రుణాలను,వాహనముల ఋణములు,ఇంటి నిర్మాణం కొరకు మరియు ఎడ్యుకేషన్ లోన్ నందు అతి తక్కువ వడ్డీ తో  అందించగల గ్రామీణ బ్యాంకు అని, చిన్న చిన్న తోపుడు బండ్లు,చిరు వ్యాపారం చేసుకునే వారి కోసం గ్రామీణ బ్యాంకు అన్ని బ్యాంకుల కన్న  డిపాజిట్ ల పై అతి తక్కువ వడ్డీ ఇస్తున్న గ్రామీణ బ్యాంకును ప్రతి ఒక్కరూ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని రీజినల్ మేనేజర్ మహిళలకు  అవగాహనా కలిపించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ నవీన్ కుమార్, బ్యాంకు సిబ్బంది,ఐనాన ఫీల్డ్ ఆఫీసర్ పి.ఎన్.విష్ణు తేజా నాయుడు,ఆఫీసర్ సుస్మిత ప్రవీణ్,మనోజ్,  పొదుపు సంఘాల సీసీ లు,బ్యాంకు బిసి లు.మరియు బుక్ కీపర్ర్స్ పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: