బీఆర్ఎస్ లో చేరిన...
బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం నేతలు... సభ్యులు
మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్న నేతలు
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం నేతలు, సభ్యులు బీఆర్ఎస్ పార్టలో చేరారు. శనివారంనాడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం లోని మీరిపేట మున్సిపల్ కార్పొరేషన్ క్యాంపు కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించే వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి భూమి పూజ జరిగింది. వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షిగా మహేశ్వరం నియోజకవర్గంలో అభివృద్ధి కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ఆర్యవైశ్య సంఘం నేత శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో ఆ సంఘం సభ్యులు అందరూ కూడా మంత్రి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరూ కూడా సబితా ఇంద్రారెడ్డికి పూర్తి మద్దతు తెలుపుతూ వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షిగా ఈ సందర్బంగా ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీపులాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, సిద్దాల లావణ్య, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అరకల కామేష్ రెడ్డి, కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు అనుబంధ సంఘాల నాయకులు భారీగా హాజరైన బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: