గడివేముల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం

నూతన కార్యవర్గ కమిటీ ఎన్నిక

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలం స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు వీర బొమ్మ నాగ సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శి బింగిమల శ్యామ్ సుందర్ గుప్తా మరియు ఉప కోశాధికారి భీమిశెట్టి మురళీకృష్ణ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడివేముల మండలంలో ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ ఏకతాటిపై నిలబడి ఉండడం ఎంతో సంతోషించేదగ్గ విషయమని,ఆర్యవైశ్య సంఘం లోని నిరుపేదల విద్యార్థుల వైద్య,విద్య సదుపాయాలకు తమ దృష్టికి తీసుకుని వస్తే తమ వంతు కృషి చేస్తామని, శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.


అనంతరం ఆర్యవైశ్యసంఘం నూతన అధ్యక్షులుగా ఎంపికైన బొంతల మధుసూదన్ గుప్తా,ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్,నరహరి మల్లికార్జున,కార్యదర్శి సి.వి.రమణయ్య, కోశాధికారి నరహరి వెంకటేశ్వర్లు,12 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఎంతో సంతోషదాయకమని, నూతనంగా ఎన్నికైన సభ్యులందరినీ అభినందించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు,కార్యదర్శి, కోశాధికారి,కార్యవర్గం సభ్యులు మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.ఈ సమావేశంలో ఆర్యవైశ్య సంఘం కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: