మానవత్వం చాటిన.. గడివేముల ఎమ్మార్వో శ్రీనివాసులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం లో వాచ్మెన్ గా పనిచేస్తున్న సుంకన్న అనే వ్యక్తి విధులు నిర్వహిస్తు తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం బయటికి వెళ్ళగా సూపర్ మార్కెట్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వెళ్లిపోగా మోకాలి నుంచి ఎముక పక్కకు తొలిగి నడవలేని పరిస్థితిలో ఉన్నాడన్న విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాసులు మరియు పోలీసులు అక్కడికి చేరుకుని అతనిని మెరుగైన చికిత్స అందించడం కోసం నంద్యాల హాస్పటిల్ కు పంపడానికి 108 కి ఫోన్ చేయగా అందుబాటులో లేకపోవడంతో 30 నిముషాలు వేచి చూసిన సమాధానం అందకపోవడంతో ప్రైవేట్ వాహనాల్లోనైనా తరలించాలని విశ్వ ప్రయత్నం చేసి చివరకు అతని బాధ చూడలేక ప్రైవేట్ వాహనంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మానవత్వం చాటుకున్న తహసిల్దార్ శ్రీనివాసులను పోలీసులను గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: