ముఖ్యమంత్రి శివరాజ్  సింగ్ చౌహాన్ నిర్ణయం అభినందనీయం

బీజేపీ నేత బుక్క వేణనుగోపాల్ ప్రశంస

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్ర నగర్ ప్రతినిధి)

పాఠశాల సిలబస్‌లో వేదాలు, పురాణాలను ప్రవేశపెట్టాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్  సింగ్ చౌహాన్ తీసుకున్న నిర్ణయం అద్భుతమైందని రాజేంద్రనగర్ నియోజకవర్గం సీనియర్ బిజెపి నాయకుడు బుక్క వేణుగోపాల్ ప్రశంసించారు.  మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం పాశ్చాత్య నాగరికత బారిన పడిన పిల్లలకు సంస్కృతి, విలువలను పెంపొందించడంలో బీజేపీ యొక్క పురోగతిని సూచిస్తుందన్నారు. పాఠశాల సిలబస్‌లో మహాభారతం, రామాయణం, భగవద్గీత, వేదాలు మొదలైన వాటిని ప్రవేశపెట్టాలని బుక్కా వేణుగోపాల్ దేశంలోని అన్ని రాష్ట్రాలకు సూచించారు. ఈ పుస్తకాలు పిల్లలకు సంస్కృతి, విలువలను అందించడమే కాకుండా వారిని భారత దేశపు సమర్థవంతమైన పౌరులుగా సుసంపన్నం చేస్తాయని బుక్క వేణుగోపాల్  అభిప్రాయపడ్డారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: