ఆ ఆదర్శ పిలుపునకు విశేష స్పందన
మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునకు ఊహించని ఆదరణ
ఆరు వేల పై చిలుకు పుస్తకాలు...డీక్షనరీలు, మ్యాట్లు.వితరణగా ఇచ్చారు
త్వరలో నియోజకవర్గములోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా పాఠశాల విద్యార్థులకు రెండింతలు నేరుగా అందించిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
ఓ మంచి సందేశాత్మక పిలుపునిచ్చి యావత్తు తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఏ నేత అయినా సరే తన జన్మదినానికి తన అనచరగణం, నేతలు బొకేలు, పూలతో ముంచెత్తితే ఆ ఆనందానికి అవదులుండవు. కానీ అలాంటి ఆడంబరాలకు దూరంగా వాటికి అయ్యే ఖర్చును పేద విద్యార్థులకు ఖర్చు చేయాలని సందేశాత్మక పిలుపునిచ్చి మంత్రి సబితా ఇంద్రారెడ్డి దేశంలోని ప్రజాప్రతినిధులందరికీ ఆదర్శంగా నిలిచారు అనడంలో అతిశయోక్లిలేదు. ఇలాంటి ఆదర్శముర్తలు పిలుపునిస్తే స్పందించే మనస్సులు కూడా వేలాదిగా ఉంటాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపుతో స్పస్టమైంది.
బొకేలు, శాలువలు లాంటి వృధా ఖర్చుల స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన జన్మదినం సందర్భంగా ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన లభించింది. మంత్రికి నేరుగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెల్పిన వారు సుమారు 6 వేల నోట్ పుస్తకాలు అందించగా, అంతకు రెండింతలు మరికొందరు తమ గ్రామాల్లో విద్యార్థులకు అందజేసి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసారు. మంత్రి పిలుపుతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని నాయకులు తమ తమ గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నోట్ పుస్తకాలు, డీక్షనిరీలు, మ్యాట్లు ,బ్యాగులు, వాటర్ బాటిళ్లు పాఠశాలల విద్యార్థులకు అందించారు.
డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి పరిగి నియోజకవర్గములోని పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను అందజేయటానికి ముందుకు వచ్చి మంత్రితో కార్యక్రమాన్ని ప్రారంభింపజేసారు. చేవెళ్ల నియోజకవర్గము శంకర్ పల్లి మునిసిపాలిటీకి చెందిన 5 వ తరగతి విద్యార్థి ఎండి అసద్ తాను దాచుకున్న బ్యాంకులోని డబ్బులతో నోట్ పుస్తకాలు కొని మంత్రికి అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి అందరికి ఆదర్శoగా నిలిచాడు.
అదే విధంగా రెండు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వృధా ఖర్చుల స్థానంలో ఉపయోగపడే స్టేషనరీ లభించింది. ఇదే స్ఫూర్తితో ఇక ముందు కూడా తనతో పాటు ఎవరిని కలిసిన ఇదే విధానం కొనసాగించాలని మంత్రి కోరారు. తన పిలుపుకు స్పందించి ముందుకు వచ్చిన అందరికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లోని పాఠశాలలను దత్తత తీసుకోవాలని, అంగన్ వాడి విద్యార్థులకు మ్యాట్లు, వాటర్ బాటిళ్లు, బ్యాగులు, బుక్కులు అందించి అండగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు.
Home
Unlabelled
ఆ ఆదర్శ పిలుపునకు విశేష స్పందన ,,,, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునకు ఊహించని ఆదరణ,,,, ఆరు వేల పై చిలుకు పుస్తకాలు...డీక్షనరీలు, మ్యాట్లు.వితరణగా ఇచ్చారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: