గడివేముల నుండి బ్రాహ్మణపల్లి వరకు,,
రహదారిని పునర్ నిర్మించాలి
బీఎస్పీ పార్టీ డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం స్థానిక గడివేముల నుండి బ్రాహ్మణపల్లి వరకు తారు రోడ్డును పునర్ నిర్మించాలని బీఎస్పీ పార్టీ నందికొట్కూరు అసెంబ్లీ ఇంచార్జి ఎల్ స్వాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందికొట్కూరు మరియు కర్నూలు నుండి రోజు వందల సంఖ్యలో ఆటోలు బస్సులు ద్విచక్ర వాహనాల్లో వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారని,ఈ రహదారి పూర్తిగా దెబ్బతిని ప్రయాణికులకు ప్రయాణం నరక ప్రాయంగామారిందనీ, కొన్ని సందర్భాల్లో రహదారి సరిగ్గా లేక ప్రమాదాలు జరిగి మరణించిన వారు చాలామంది ఉన్నారని, ఎన్నో రోజుల నుండి ఈ రహదారి వైపు స్థానిక ఎమ్మెల్యే గారు మరియు ఆర్ అండ్ బి అధికారులు కన్నెత్తైనా చూడడం లేదని,రహదారి పునర్ నిర్మాణంపై నిర్లక్ష్యం వహిస్తున్న ఆర్అండ్ బి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని,
జిందాల్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం జిందాల్ నుండి నంద్యాల వరకు సిమెంట్ రోడ్డు భారీ వాహనాలు వెళ్లేందుకు వేశారని అయితే భారీ వాహనాలు గడివేముల నుండి నందికొట్కూరు, కర్నూలు వైపుతిరుగుతున్న రహదారి వైపు సిమెంట్ రోడ్డు ఎందుకు నిర్మించలేదనీ ప్రశ్నించారు. రోడ్ల పునర్ నిర్మాణ విషయంలో అధికారులు చొరవ తీసుకొని రహదారులను పునర్ నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. త్వరితగతిన రహదారుల పునర్ నిర్మాణం చేపట్టాలని,లేనిపక్షంలో రహదారుల పునర్ నిర్మాణానికి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు.
Home
Unlabelled
గడివేముల నుండి బ్రాహ్మణపల్లి వరకు,, రహదారిని పునర్ నిర్మించాలి-- బీఎస్పీ పార్టీ డిమాండ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: