శ్రీ కోటలక్ష్మి చెన్నకేశవ స్వామి పారువేట మహోత్సవాన్ని...
ఘనంగా నిర్వహించిన గడివేముల గ్రామ ప్రజలు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండల పరిధిలోని గడిగరేవుల, గడివేముల స్థానిక శ్రీ కోట లక్ష్మి చెన్నకేశవ స్వామి వారిని గడివేముల గ్రామంలోని ప్రజలు భారీ సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా అర్చకులు కృష్ణమూర్తి,దేశం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు శ్రీ కోట లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి ఆశీస్సులతో గ్రామంలోని రైతులు,ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు దినదినాభివృద్ధి చెందాలని, ఆయురారోగ్యాలతో, సంతోషాలతో,అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని,
గ్రామ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు ఐక్యమత్యంతో గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలిపారు.అనంతరం నిర్వహించిన పారువేట ఉత్సవ కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని ఆనందించారు. ఈకార్యక్రమంలో గడివేముల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేశం సత్యనారాయణరెడ్డి తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు,మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Home
Unlabelled
శ్రీ కోటలక్ష్మి చెన్నకేశవ స్వామి పారువేట మహోత్సవాన్ని... ఘనంగా నిర్వహించిన గడివేముల గ్రామ ప్రజలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: