గిరిజన ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలి..
బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ విద్యార్థి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ పాలుట్ల రమణ డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
గిరిజన ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ విద్యార్థి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ పాలుట్ల రమణ డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం లోని ఆత్మకూరు మండలంలోని గిరిజన పాఠశాలలో విద్యార్థుల చదువులకు ఉపాధ్యాయులు లేక బోధనవిద్యకు గిరిజన విద్యార్థులు దూరమవుతున్నారని, ఎక్కువగా ఒక ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయుడు సెలవు పెడితే ఆరోజు పాఠశాల మూత పడుతున్నాయని, ఉపాధ్యాయుడు లేక గిరిజన చెంచుగూడాలలో బాలకార్మికుల సంఖ్య పెరిగిందని,చాలా మంది విద్యార్థులు బడి మానేసి తల్లిదండ్రుల వెంట అడవిబాట పడుతున్నారని, ఉపాధ్యాయుల కొరత ఉన్న గిరిజనపాఠశాలలో ఉపాధ్యాయులను నియమించి గిరిజన విద్యార్థులకు జీవితాల్లో వెలుగులు నింపాలని, విద్యాశాఖ అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి ఉపాధ్యాయులను నియమించాలని,
ఉపాధ్యాయులను నియమించని పక్షంలో భారీ ఎత్తున నిరసన,ఆందోళన కార్యక్రమాలను చేపడతామని బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ విద్యార్థి, యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ పాలుట్ల రమణ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు రాజు,మధు,సురేష్, తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
గిరిజన ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలి.. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ విద్యార్థి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ పాలుట్ల రమణ డిమాండ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: