మహేశ్వరం, ఇబ్రహీంపట్నంలో కొనసాగుతున్న
మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన
కంటి వెలుగు కార్యక్రమాలకు హాజరు
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాలలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఉదయం హైదరాబాద్ నుంచి మీర్ పేట్ చేరుకొన్నారు. మీర్ పేట్, జల్ పల్లి, మహేశ్వరం నందు జరిగిన కంటి వెలుగు కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఇంబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం మహేశ్వరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకొంటారు. అనంతరం మహేశ్వరంలో మండల సమావేశాలతోపాటు గురుకుల పాఠశాలలపై, మనఊరు మన బడి కార్యక్రమాలపై అధికార్లతో సమీక్షాసమావేశంలో పాల్గొంటారు. అనంతరం కందుకూరు మండల్ సమావేశంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ చేరుకొంటారు.
Home
Unlabelled
మహేశ్వరం, ఇబ్రహీంపట్నంలో కొనసాగుతున్న,, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన ,,,కంటి వెలుగు కార్యక్రమాలకు హాజరు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: