బేతంచెర్ల లోని బ్రహ్మారెడ్డి వైద్యశాలను తక్షణమే సీజ్ చేయాలి

రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (ఆర్విఎఫ్) డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని బేతంచర్ల పట్టణంలో ఉన్న బ్రహ్మారెడ్డి హాస్పిటల్ నందు డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రమాదేవిపై తక్షణమే కేసు నమోదు చేసి హాస్పటల్ సీజ్ చేయాలని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్) డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ నాయకులు రాయలసీమ రవీంద్ర నాథ్, బత్తిన ప్రతాప్ మాట్లాడుతూ 73 వ గణతంత్ర దినోత్సవ సాక్షిగా న్యాయాన్ని నాలుగు దిక్కులా హత్య చేసి, అక్రమ సంపాదనకై వైద్య నిబంధనలకు వ్యతిరేకంగా నిండు గర్భిణీకి బృన హత్యలు(అబాషన్)వైద్యం వికటించి బేతంచెర్ల మండల పరిధిలోని బుక్కాపురం గ్రామానికి చెందిన మహిళ మృతికి కారణమైన బ్రహ్మారెడ్డి వైద్యశాల వైద్యురాలు రమాదేవి పై తక్షణమే కేసు నమోదు చేసి హాస్పటల్ సీజ్ చేయాలని,


స్వాతంత్ర్య భారతదేశంలో నేటికీ పౌరుల బతుకులు మారక సరైన వైద్యం అందక సామాన్య పేద మధ్య తరగతి ప్రజల దైనందిక జీవితాలతో చెలగాటం ఆడుతూ వైద్యశాలలో నియంతగా వ్యవహరిస్తూ నిండు గర్భిణీకుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని,బేతంచర్ల పట్టణంలోని కొంతమంది స్థానిక నాయకులు, ఓప్రజాప్రతినిధి గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ పంచాయతీ చేసి బాధితులకి నచ్చచెప్పి వైద్యురాలు రమాదేవికి అండదండగా నిలబడి ఎవరు వచ్చినా ఈ ఊరులో మమ్మల్ని కాదని ఎవరు రారని భరోసా ఇవ్వడం ఎంతవరకు సమంజసమనీ, ప్రజలకు న్యాయం చేయాల్సిన వారే ఇలా హంతకులకు అండగా నిలబడడం చూస్తే ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని,తక్షణమే మృతురాలి కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించి మృతురాలి నలుగురు పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనీ,సంబంధిత అధికారులు స్పందించి మృతికి కారణమైన బ్రహ్మారెడ్డి వైద్యశాల వైద్యురాలు డాక్టర్ రమాదేవి పై తక్షణమే కేసు నమోదు చేసి హాస్పటల్ ని సీజ్ చేయాలని లేని పక్షంలో హాస్పిటల్ ఎదుట ప్రత్యక్ష నిరసన కార్యక్రమాలు చేపడతామని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ నాయకులు హెచ్చరించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: