కేసీఆర్....కేటీఆర్ ప్రత్యేక చొరవతో
రాష్ట్రానికి వెల్లువలా పెట్టుబడులు
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణ రాష్టానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ర్కొన్నారు. మహేశ్వరం మండలంలో తుమ్మలూరు రెవెన్యూ పరిధిలో చిరిపాల్ పాలీ ఫిల్మ్స్ లిమిటెడ్ కంపెనీని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణ రాష్టానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని పేర్కొన్నారు. గుజరాత్ రాష్టానికి చెందిన చిరిపాల్ సంస్థ వెయ్యి కోట్ల పెట్టుబడితో ఇక్కడ సంస్థను నెలకొల్పటం ఎంతో గొప్ప విషయం అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి దారులకు సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్టానికి పెట్టుబడులు వచ్చేలా సులభతరమైన పారిశ్రామిక విధానం తెచ్చారని అన్నారు. తద్వారా స్థానిక యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.రాష్ట్ర ఆదాయం పెరగాలంటే పారిశ్రామిక అభివృద్ధి జరుగాలన్నది ప్రభుత్వ అభిమతం అన్నారు.టిఎస్ ఐపాస్ లాంటి వ్యవస్థను తెచ్చి,ఎలాంటి మధ్యవర్తిత్వం, అవినీతికి ఆస్కారం లేకుండా తక్కువ సమయంలో అన్ని రకాల అనుమతులు లభించేలా,వారికి భూమి,నీరు,విద్యుత్ లాంటి సౌకర్యాలు కల్పించటంతో 2 లక్షల 50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.8 ఏళ్ళ కాలంలో 21 వేల కంపెనీలు తెలంగాణ కు వచ్చాయని 17 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు.గుజరాత్లో 40 ఇండస్ట్రీలు ఉన్న సంస్థ మొదటి సారి ఆ రాష్టం దాటి మొట్టమొదటి యూనిట్ ను తెలంగాణ లో నెలకొల్పటం గొప్ప విషయం అన్నారు.కేటీఆర్ గారు ఇచ్చిన భరోసా తో ఇక్కడ సజావుగా యూనిట్ ఏర్పాటు చేయగల్గినట్లు వారు పేర్కొన్నారని అన్నారు.
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకెళ్తుందని దేశ జిడిపి కన్నా రాష్ట్ర జిడిపి పెరిగిందంటే రాష్ట్రంలో పకడ్బందీగా, ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, సంస్థ చైర్మన్ వేద ప్రకాష్, టిఎస్ఐఐసీ వైస్ చైర్మన్ నరసింహ్మరెడ్డి, ఎంపీపీ రఘుమా రెడ్డి, తుక్కు గూడ వైస్ ఛైర్మన్ భవాని వెంకట్ రెడ్డి, సర్పంచ్ మద్ది సురేఖ కరుణాకర్ రెడ్డి, కంపెనీ ప్రతినిధులు, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.
Home
Unlabelled
కేసీఆర్....కేటీఆర్ ప్రత్యేక చొరవతో.. రాష్ట్రానికి వెల్లువలా పెట్టుబడులు-- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: