దూద్ బోలి పైనీరు ముత్యాలమ్మ దేవాలయ ప్రాంగణంలో
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు
మొదటి బహుమతి పొందిన రేఖ
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
హైదరాబాద్ పాతిబస్తీలోని దూద్ బోలి పైనీరు ముత్యాలమ్మ దేవాలయ ప్రాంగణంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు నరసింహారావు ముదిరాజ్ పాల్గొని ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు అవార్డులు ప్రధానం చేశారు. ఇందులో మొదటి బహుమతిగా సికింద్రాబాద్ కు చెందిన రేఖ ఎంపికైంది.
ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు నరసింహారావు ముదిరాజ్ మొదటి బహుమతి గెలుపొందిన రేఖను శాలువాతో సన్మానించి బహుమతిని అందజేశారు. అనంతరం నరసింహారావు ముదిరాజ్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ఎంతో నిలయంగా మారిందని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో ఆలయ మహిళా ప్రతినిధులు ధనలక్ష్మి చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు
Home
Unlabelled
దూద్ బోలి పైనీరు ముత్యాలమ్మ దేవాలయ ప్రాంగణంలో,,, సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు ,,, మొదటి బహుమతి పొందిన రేఖ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: