గడివేముల ఆంధ్ర ప్రగతి బ్యాంక్ ఆధ్వర్యంలో..

ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం స్థానిక గడివేముల ఆంధ్ర ప్రగతి గ్రామణ బ్యాంకు శాఖ మేనేజర్ వి. జాన్, అసిస్టెంట్ మేనేజర్ విష్ణు తేజ నాయుడు ఆధ్వర్యంలో నాబార్డ్ సౌజన్యంతో గడివేముల బీసీ కాలనీ ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వి.జాన్,అసిస్టెంట్ మేనేజర్ విష్ణు తేజ నాయుడు మాట్లడుతూ ఆంధ్రప్రగతి బ్యాంకు అందిస్తున్న వివిధ రకాల డిపాజిట్ పథకాల సౌకర్యముల గురించి, అన్ని బ్యాంకుల కంటే డిపాజిట్లపై అధిక వడ్డీని అందజేస్తున్నామని, ప్రగతి సిరి పథకంలో అధికంగా 7.8 % వడ్డీ ఇస్తున్నామని, బంగారు రుణాలు అతి తక్కువ వడ్డీకి వెంటనే మంజూరు చేస్తున్నామని, ప్రధానమంత్రి సురక్ష  బీమా యోజన,ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకం పథకంతో పాటు అటల్ పెన్షనర్ యోజన పథకం కూడా నిర్వహిస్తున్నామని,  జీవిత బీమా పాలసీలు, ఆన్లైన్లో ప్రజలు ఖాతాలు ఓపెన్ చేసుకునేటట్లు,పాడి పశువులు పెంపకానికి, గృహ నిర్మాణానికి,ట్రాక్టర్లు మరియు ఇతర వాహనములకు రుణాలను, రైతన్నలకు పంట ఉత్పత్తికి,వ్యవసాయ పనిముట్లు కొనుగోలుకు రుణాలు, చిరువ్యాపారాలకు, తోపుడుబండ్ల వ్యాపారులకు లోన్లు అందజేస్తున్నామని, సామాజిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ లోనే లావాదేవీలను నిర్వహించుకునే ఖాతా,


ఏపీజీబీ మొబైల్ బ్యాంకింగ్,ఏపీజీబీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏపీజీబీ మిస్డ్ కాల్ బ్యాంకింగ్ వసతులు ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని గడివేముల గ్రామ ఖాతాదారులు అందరూ ఉపయోగించుకొని బ్యాంకు పురోగ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం కళాజాతకు సంబంధించిన సభ్యులు మ్యాజిక్ షో ద్వారా  ప్రజలను ఉత్సాహపరుస్తూ పొదుపు ఆవశ్యకతను  తెలియజేస్తూ బ్యాంకు పథకాల గురించి పాటల రూపంలో ఆలపించారు.ఈ సమావేశంలోఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనజర్ వి.జాన్,అసిస్టెంట్ మేనేజర్ విష్ణుతేజనాయుడు, క్యాషీయర్ మనోజ్,బ్యాంక్ బీసీలు, కళాజాతసభ్యులు, గడివేముల బిసి కాలని ప్రజలు పాల్గొన్నారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: