అమరావతిపై ఏపీ ప్రభుత్వ పిటిషన్ 

గతంలో అమరావతిలో నిర్మాణాలకు కాలపరిమితిపై హైకోర్టు తీర్పు ఇవ్వగా, దానిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అమరావతే ఏపీకి రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా స్టే విధించాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో, అమరావతి అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో రాజధాని రైతులు, పలు రాజకీయ పక్షాలను ప్రతివాదులుగా పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. జనవరి 31వ తేదీ లోపు అఫిడవిట్ దాఖలు చేయాలంటూ మొత్తం 161 మంది ప్రతివాదులను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: