నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ ముకరంజ సమాధి వద్ద
ముస్లింల ప్రత్యేక ప్రార్థనాలు
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
చారిత్రాత్మక మక్కా మసీదులో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు ప్రశాంతంగా ముగిసాయి మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన ప్రార్థనలు ఒకటిన్నర గంటలకు ముగిసాయి, ఈ ప్రార్థనలో వేలాదిమంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు మక్కా మసీదులోని ఆసఫ్ జాహీ సమాధుల పక్కనే ఉన్న హైదరాబాద్ ఎనిమిదవ నిజాం దివంగత నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ ముకరంజ సమాధిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసి నివాళులు అర్పించారు.
జాతీయ ఇస్లామిక్ స్కాలర్ అలమా సల్మాన్ హుస్సేన్ నదివి. దక్షిణ భారతదేశ ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అధ్యక్షులు రాషేద్ షరీఫ్ ఆయన సమాధి వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా చార్మినార్ మక్కా మసీద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
Home
Unlabelled
నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ ముకరంజ సమాధి వద్ద,,,ముస్లింల ప్రత్యేక ప్రార్థనాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: