గుంటూరులో జరిగే 'ఆవాజ్'రెండవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి....
ఆవాజ్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం పరిధిలోని ప్యాపిలి మండలంలో డోన్ ఆవాజ్ కమిటీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవాజ్ రెండవ రాష్ట్ర మహాసభలు గుంటూరు నగరంలో జనవరి 8, 9 తేదీలలో జరుగుతుందని, మైనార్టీల అభివృద్ధి భద్రత మరియు లౌకికవాద పరిరక్షణ కొరకు విశేష కృషి చేస్తుందని, జస్టిస్ సచార్ కమిటీ, రంగనాద్ మిశ్రా కమిటీల నివేదిక సారాంశం 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో సగటు ముస్లిం మైనార్టీ పరిస్థితి "ఊపర్ సే షేర్వానీ అందర్ సే పరేషాన్" గా ఉందని,ఈ కమిటీల సిఫారసులను పాలక ప్రభుత్వాలువిస్మరించినటు వంటి పరిస్థితులలో వాటి అమలు కోసం అవాజ్ నిరంతరం కృషి చేస్తుందని, రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు,వక్స్ బోర్డ్ ఆస్తుల పరిరక్షణ సబ్ ప్లాన్ చట్టం, దుల్హన్ పథకము,10% రిజర్వేషన్,మౌజన్, ఇమామ్లా వేతనాల పెంపు లాంటి సమస్యలపై పోరాడుతూ మైనార్టీల అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతుందని,
దేశంలో రెండోసారి బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీల పైన హిజాబ్,హలాల్ , నమాజ్ ,అజాన్,లౌజిహాద్,గోమాంసం, లాంటి రూపాలలో లౌకిక మతోత్మాద దాడులు చేస్తున్న ప్రతి సందర్భంలోనూ 'ఆవాజ్' ప్రతిఘటిస్తూ ముస్లింలకు అండగానిలుస్తుందని, మతం ఆధారంగా వారసత్వం ముస్లింల ఉనికిని ప్రమాదంలో పడేసే ఎన్ఆర్సి,ఎన్పిఆర్,సిఏఏ లాంటి చట్టాలను తీసుకొని వచ్చినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వాటికి వ్యతిరేకంగా ముస్లింలను ముస్లిమేతరులను కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేసినటువంటి లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదికలో "అవాజ్" ముఖ్యపాత్ర వహించిందని, దళితమహిళలు, గిరిజనులు, మానవ హక్కుల కార్యకర్తలపై బిజెపి దాడులు చేసినప్పుడు 'అవాజ్ 'బాధితులకు అండగా ఉంటూ వచ్చిందని,జనవరి 8,9వ తేదీలలో గుంటూరు నగరంలో జరుగు'అవాజ్' రాష్ట్ర మహాసభలకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ముస్లిం సోదరులు,ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.ఈ సమావేశంలో ఇలియాజ్,జాఫర్,అక్బర్ బాషా,హబీబ్ భాషా, మస్తాన్వలి,హుస్సేన్ భాష తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: