విద్యార్థిని,విద్యార్థులు కంప్యూటర్ పై అవగాహన పెంచుకోవాలి
పాణ్యం శాసనసభ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక గడివేములలో కీర్తిశేషులు బొంతల సుబ్బరాయుడు సేవా సమితి వారు ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా పాణ్యం శాసనసభ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి విద్యార్థిని విద్యార్థులు కంప్యూటర్ అవగాహన కల్పించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో బొంతల సుబ్బరాయుడు సేవాసమితి వారు 1,50,000 రూపాయలు వెచ్చించి ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు,
గతంలో కూడా బొంతల సుబ్బరాయుడు సేవాసమితి వారు ఎండాకాలంలో ప్రజలకు త్రాగునీటి సౌకర్యం,అనాధ పిల్లలకు బట్టలు,విద్యార్థిని విద్యార్థులకు చదువుకునేందుకు పుస్తకాలు,పేన్నులు, పెన్సిల్లు పంపిణీ చేశారని, ఉపాధి కల్పన చేసుకునే వారికి చేయూతనిచ్చిన బొంతల సుబ్బరాయుడు సేవా సమితిని ఏర్పాటు చేసిన కుమారులు బొంతల మధుసూదన్ గుప్తా, బొంతల సుధాకర్,బొంతల ప్రసాదులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో గడివేముల మండల జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు సివి రమణయ్య, నంద్యాల వెంకటేశ్వర్లు, దేశం సంజీవరెడ్డి, ఎంపీటీసీ బాలచిన్ని, శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ రామేశ్వరరావు, విద్యార్థిని, విద్యార్థులు మరియు గడివేముల మండల వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
విద్యార్థిని,విద్యార్థులు కంప్యూటర్ పై అవగాహన పెంచుకోవాలి,,, పాణ్యం శాసనసభ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: