రబిసీజన్లో పంటల నమోదు,,,
ప్రతిరైతు విధిగా చేయించుకోవాలి
నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రావు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలోని చిందుకూరు గ్రామంలో ఈ పంట నమోదు కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చిందుకూరు గ్రామ రైతు సోదరులతో ఈ పంటల నమోదు కార్యక్రమం పై అవగాహన కల్పిస్తూ వీటి వల్ల పొందే ప్రయోజనాల గురించి మాట్లాడుతూ డాక్టర్ వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం,ధాన్యము సేకరణ,ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ పంట రుణాలు పొందవచ్చని రైతులకు తెలియజేశారు.పిఎం కిసాన్ లో తప్పులు సవరించుకునేందుకు 15 వ తేదీ ఆఖరని,రైతులందరూ రైతు భరోసా కేంద్రం వద్దకు వెళ్లి సిబ్బందిని సంప్రదించి తప్పులు సవరించుకొని లబ్ధి పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడివేముల మండల వ్యవసాయ శాఖ అధికారి హేమ సుందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ సిబ్బంది, చిందుకూరు గ్రామ రైతులు పాల్గొన్నారు.
Home
Unlabelled
రబిసీజన్లో పంటల నమోదు,,, ప్రతిరైతు విధిగా చేయించుకోవాలి,,, నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రావు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: