జర్నలిస్ట్ జావీద్ అలీ  ఖాన్ కుటుంభాన్నిపరామర్శించిన..

ఐజేయూ, హెచ్ యూజే నేతలు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

హైదరాబాద్ పాతబస్తీ. సీనియర్.జర్నలిస్ట్ (ఆంధ్రప్రభ) జావీద్ అలీ  ఖాన్ మృతి చెందడం చాలా బాధకారమని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ అబ్దుల్ మజీద్, హెచ్ యూజే సభ్యులు ఖాజా అబ్దుల్ హమీద్ తెలిపారు. గత ఆదివారంనాడు జర్నలిస్ట్ జావీద్ అలీ ఖాన్ అస్వస్థతకు గురై మరణించిన విషయం తెలిసిందే. జావీద్ అలీ ఖాన్ సతీమణిని  హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు ఖాజా అబ్దుల్ హమీద్, ఐజేయూ ఎగ్జిక్యూటీయ్ మెంబర్ అబ్దుల్ మజీద్ కలసి వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జావీద్ ఫొటోకు పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జావీద్ ఆకస్మిక మరణం పట్ల  చింతిస్తున్నామని తెలిపారు. జావీద్ అలీ ఖాన్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు కుటుంబ పోషణకు రూ.3116రూపాయల పెన్షన్ వచ్చే విదంగా జర్నలిస్ట్ యూనియన్ తరపున కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ ఎగ్జిక్యూటీమ్ మెంబర్ అబ్దుల్ మజీద్, హెచ్ యూజే నాయకులు ఖాజా అబ్దుల్ హమీద్, హెచ్ యూజే ప్రధాన కార్యద్శర్శి అబ్దుల్ హమీద్ సౌకత్, ఎగ్జిక్యూటీమ్ మెంబర్  సుల్తాన్, ఇబ్రహీం, అజర్ తోపాటు స్థానిక జర్నలిస్ట్ నేతలు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: