ప్రమాదవశాత్తూ లోయలో పడి...భారత జవాన్ల మరణం

దేశ కోసం పాకాల కాస్తున్న మన జవాన్లు ప్రమాదవశాత్తు మరణించారు. జమ్మూ కశ్మీర్ లో దారుణం చోటుచేసుకుంది. విధుల్లో భాగంగా గస్తీ కాస్తున్న ముగ్గురు సైనికులు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయారు. దీంతో ఆ ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు. నార్త్ కశ్మీర్ లోని కుప్వారాలో 14వ బెటాలియన్ కు చెందిన ఒక అధికారి, ఇద్దరు జవాన్లు ఈ ప్రమాదంలో చనిపోయారు. ఫార్వార్డ్ ఏరియాలో ఈ ముగ్గురూ విధులు నిర్వహిస్తుండగా మంచు పెళ్లలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. 

దీంతో పట్టుతప్పి వాళ్లు ముగ్గురూ లోయలో పడిపోయారని చెప్పారు. వారికోసం గాలింపు చేపట్టగా.. ముగ్గురి మృతదేహాలు దొరికాయని చీనార్ కోర్ కు చెందిన అధికారులు వివరించారు.  ఇదిలావుంటే ఈ ప్రమాదంలో చనిపోయిన సైనికులు, అధికారి ఎవరనే వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని, పూర్తి వివరాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: