సరస్వతి నిలయంగా మహేశ్వరం నియోజకవర్గం

మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో... 

నియోజకవర్గానికి తరలివస్తున్న నుతన విద్యా సంస్థలు

విద్యాలయాలకు అధునాతన హంగులు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

తనను ఆదరించి గెలిపించిన మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు అంతే అభిమానంతో ఉన్నత విద్యా సంస్థలను తీసుకొచ్చి బహ‍ుమతిగా ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. విద్యాలయాలకు నిలయంగా మారుతున్న మహేశ్వరం నియోజకవర్గ వ్యాప్తంగా విద్య కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారు.


తన నియోజకవర్గములో 4 జూనియర్ కళాశాలలకు 6 కోట్ల 55 లక్షలతో నూతన తరగతి గదులు, కాంపౌండ్ వాల్ లు,ఇతర పనులు చేపడుతున్నారు.  మహేశ్వరం జూనియర్ కళాశాలలో  4 అదనపు తరగతి గదులు,మరుగుదొడ్ల నిర్మాణాలకు,1 కోటి 20 లక్షలు మంజూరు చేసామని, మహేశ్వరం డిగ్రీ కళాశాలకు 1 కోటి నిధులు మంజూరు చేస్తున్నారు.  మహేశ్వరం మోడల్ స్కూల్ కు 4 కోట్లతో ఒక ఫ్లోర్,హాస్టల్,కాంపౌండ్ వాల్,సుందరికరణ పనులు చేపడుతున్నారు, మహేశ్వరం కేజిబివి పాఠశాలకు 5 లక్షల 50 వేలు,రెండు కోట్ల 30 లక్షలతో జూనియర్ కళాశాల భవనానికి మంజూరు అయ్యాయి. తుక్కుగుడా లో పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేస్తూ, మన ఊరు మన బడి కింద నియోజకవర్గములో 16 కోట్లతో పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మన ఊరు మన బడి మొదటి విడతలో మిగిలిన అన్ని పాఠశాలల అభివృద్ధికి మంత్రి సబితా  ఇంద్రారెడ్డి ప్రత్యేక కృషితో 9 కోట్ల 13 లక్షల 62 వేల 800 రూపాయలు మంజూరయ్యాయి. మహేశ్వరం మండలంలోని 33 పాఠశాలలకు 2 కోట్ల 21 లక్షల 32 వేలు మంజూరు అయ్యాయి. 

పాఠశాలలకు అన్ని రకాల సౌకర్యాల కల్పనకు కృషి

మంత్రి సబితా ఇంద్రారెడ్డి


మన ఊరు మన బడిలో ఎంపిక కానీ మహేశ్వరం మండలంలోనిపాఠశాలలకు అన్ని రకాల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.మహేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో విద్యా శాఖపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ మహేశ్వరం మండలంలో మన ఊరు మన బడి కార్యక్రమం కింద 19 పాఠశాలల్లో 5 కోట్ల 19 లక్షల 80వేల పై చిలుకు నిధులతో పనులు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 వేల పై చిలుకు పాఠశాలల్లో మొదటి విడత లో 9123 పాఠశాలలు అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.... మహేశ్వరం నియోజకవర్గములో ప్రత్యేకంగా మన ఊరు మన బడి లో మొదటి విడతలో ఎంపిక కానీ పాఠశాలలో ప్రత్యేక పనులకు 9 కోట్ల 13 లక్షల 62 వేల 800 రూపాయల భారీ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.


నియోజకవర్గములో మంజూరు అయిన వివిధ సంక్షేమ శాఖల పాఠశాలలు, కళాశాలలు పూర్తి స్థాయిలో మన నియోజకవర్గములోనే కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆర్సీవోలను ఆదేశించారు. ఆయా గ్రామాల జిల్లా పరిషత్ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు.మహేశ్వరం నియోజకవర్గములో బీసీ బాలుర పాఠశాల,జూనియర్ కళాశాల,డిగ్రీ కళాశాలలు మహేశ్వరం గేట్ వద్ద స్వంత భవనంలో కొనసాగుతున్నాయని తెలిపారు. బీసీ బాలికల పాఠశాల,కళాశాలను వచ్చే విద్య సంవత్సారానికి మన ప్రాంతానికి తేవాలని,అదేవిధంగా బాలుర పాఠశాల,కళాశాలను నిశిత ఇంజినీరింగ్ కళాశాలలో నడుస్తుందన్నారు.ఎస్ సి వెల్ఫేర్ కు సంభందించి మహేశ్వరం బాలికల పాఠశాల,జూనియర్ కళాశాలను షాబాద్ నుండి నియోజకవర్గానికి మార్చినట్లు మంత్రి తెలిపారు. ఎస్ టి వెల్ఫేర్ కు సంభందించిన పాఠశాల,జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని పూర్తి అయిన వెంటనే మార్చటం జరువుతుందన్నారు.

మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన పాఠశాల, జూనియర్ కళాశాలలు గుర్రంగూడలోని శాశ్వత భవనం లో కొనసాగుతున్నాయని అన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా నియోజకవర్గములో పెద్ద ఎత్తున ఉన్నత విద్య సంస్థలు నెలకొల్పటం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ రఘుమా రెడ్డి గారు,వైస్ ఎంపీపీ సునీత అంధ్యానాయక్ గారు,మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి గారు,డిఈఓ సుశీందర్ రావు గారు, కృష్ణయ్య గారు ట్రైబల్,మైనార్టీ,సోషల్ వెల్ఫేర్ల ఆర్ సిఓ కల్యాణి గారు,శ్రీనివాస్ రెడ్డి గారు,శారదా వెంకటేష్ గారు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు,తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: