సీనియర్ జర్నలిస్ట్ జావిద్ అలీ ఖాన్ అకస్మిక మరణం

సంతాపం తెలిపిన టీయూడబ్ల్యూజే, హెచ్ యూజే నాయకులు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

పాతబస్తీకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ జావిద్ అలీ ఖాన్ అకస్మికంగా మరణించారు. చంద్రయాణగుట్ట ఆంధ్రప్రభ విలేకరిగా ఆయన పనిచేస్తున్నారు. దశబ్దాలుగా జర్నలిస్ట్ గా పనిచేస్తున్న జావిద్ అలీ ఖాన్ పనినిమిత్తం పాతబస్తీలోని ఇంజన్ బౌలి రెడ్ రోజ్ మార్ట్ వద్దకు వచ్చారు. అక్కడ ఆయన  అస్వస్థతకు గురయ్యారు. ఈ లోపు స్థానికులు ఆయన్ని ప్రిన్స్ ఇస్రా ఆసుపత్రికి తరలించగా జాబిద్ అలీ ఖాన్ మరణించినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. పత్రికా రంగంలో జావిద్ అలీ ఖాన్ ఎనలేని సేవలు అందించారు. ఇటీవల  కొత్తగా ఎన్నికైన టీయూడబ్ల్యూజే అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్(హెచ్ యూజే) ఎగ్జిక్యూటీవ్ మెంబర్ గా కూడా నియమితులయ్యారు. జావిద్ అలీ ఖాన్ మరణం పట్ల ఐజేయూ నేషనల్ కౌన్సిల్ మెంబర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఎగ్జిక్యూటీవ్ మెంబర్ వరకాల యాదగిరి, టీయూడబ్ల్యూజే అనుబంధ సంస్థ అయిన హెచ్ యూజే ప్రెసిడెంట్ శంకర్, కార్యదర్శి సౌకత్, ట్రెజరర్ శ్రవణ్ కుమార్ తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.  జాబిద్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులకు వారు తమ సానుభూతిని తెలియజేశారు.  జావిద్ అలీ ఖాన్ మరణం ప్రతికా రంగానికి తీరని లోటని వారు ప్రకటించారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: