రెడ్ క్రాస్ సొసైటీ,,, రెనాటి సూర్యచంద్రుల సేవా సమితి ఆధ్వర్యంలో,,,

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా,,,స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమం

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ మండల కేంద్రంలో రేనాటి సూర్యచంద్రుల సేవా సమితి ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంది జయంతి) సందర్భంగా స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రేనాటి సూర్యచంద్రుల సేవా సమితి కన్వీనర్ డీ.కే బాబు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ పర్ల దస్తగిరి ముఖ్యఅతిథిగా హాజరై స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి,అన్న దాత బుడ్డా వెంగల్రెడ్డి,స్వామి వివేకానంద చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, కార్యక్రమాన్ని


ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదాన కార్యక్రమం ఒక మహా యజ్ఞమని,అపాయంలో ఉన్నవారికి రక్తదాతలు ఇచ్చిన రక్తం వారికి మరో పునర్జన్మనిస్తుందని, ప్రమాదాలు జరిగినప్పుడు సరైన సమయంలో రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రక్తం అందక ఏ ఒక్కరు కూడా మరణించరాదనే సదుద్దేశంతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, రక్తదాన కార్యక్రమానికి 50 మందికి పైగా యువకులు రైతులు,శ్రామికులు, సచివాలయ సిబ్బంది, విలేకరులు స్వచ్ఛందంగా పాల్గొని రక్త దానం చేయడం ఆనందించదగ్గ విషయమని తెలిపారు. అనంతరం రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాతకు సర్టిఫికెట్ తో పాటు వివేకానంద స్ఫూర్తి పుస్తకాలను పంపిణీ చేసి అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మద్దిలేటి,రెడ్ క్రాస్ బ్యాంకు కర్నూల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి,నంద్యాల రెడ్ క్రాస్ నాయకులు నాగరాజు,వెంకటేశ్వర్లు డీఎఫ్ఓ రాజు నాయక్, ఉయ్యాలవాడ రెడ్ క్రాస్ ప్రతినిధులు మధు,బ్లడ్ బ్యాంక్ సిబ్బంది,రెడ్ క్రాస్ సభ్యులు, రక్త దాతలు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: