బాలయ్య...చిరుకు శుభాకాంక్ష‌లు తెలిపిన నారా లోకేష్

బాలయ్య... చిరంజీవిలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుభాకాంక్ష‌లు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా రెండు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్యల సినిమాలు సందడి చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ... సంక్రాంతికి ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచేందుకు 'వీరసింహారెడ్డి'గా వ‌స్తున్న బాల మావ‌య్య‌, 'వాల్తేరు వీర‌య్య‌'గా వ‌స్తున్న‌ చిరంజీవి గారికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నానని చెప్పారు. అల‌రించే పాట‌లు, ఆలోచింప‌జేసే మాట‌లు, ఉర్రూత‌లూగించే డ్యాన్సుల‌తో పూర్తిస్థాయి వినోదం అందించే ఈ చిత్రాల‌ను 

కోట్లాది ప్రేక్ష‌కుల‌లో ఒక‌డిగా నేనూ చూడాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నానని అన్నారు. హీరోల పేరుతో, కులాల పేరుతో ఫేక్ పోస్టులు సృష్టించి, విద్వేషాలు రెచ్చ‌గొట్టేందుకు అధికార పార్టీ స‌న్న‌ద్ధ‌మైందని... ఇద్ద‌రు అగ్ర‌హీరోల సినిమాలు విడుద‌లవుతున్న సంద‌ర్భాన్ని 

వాడుకుని సోష‌ల్ మీడియాలో ఫేక్‌ ఖాతాల ద్వారా ఒక కులం పేరుతో మ‌రో కులంపై


విషం చిమ్మాల‌ని కుట్ర‌లు ప‌న్నారని మండిపడ్డారు. విష‌ప్ర‌చారాలు చేసి కుల‌, మ‌త‌, ప్రాంతాల మ‌ధ్య విద్వేషాలు ర‌గిల్చిన దుష్ట చ‌రిత్ర గ‌లిగినవారి ట్రాప్‌లో ఎవ‌రూ ప‌డొద్దని హెచ్చరించారు. సినిమాలు అంటే వినోదమని, సినిమాల‌ను వివాదాల‌కు వాడుకోవాల‌నే అధికార పార్టీ కుతంత్రాల‌ను తిప్పికొడ‌దామని చెప్పారు. మ‌న‌మంతా ఒక్క‌టేనని... కులం, మ‌తం, ప్రాంతం ఏవీ మ‌న‌ల్ని విడ‌దీయ‌లేవని అన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: