కర్నూల్ రాయలసీమ యూనివర్సిటీ సూపర్డెంట్  ఇస్మాల్ పై...

 ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

ఆర్విఎఫ్, ఏఐఎఫ్బి,ప్రజాసంఘాల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి) 

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో కర్నూలు జిల్లా  రాయలసీమ యూనివర్సిటీ సూపర్డెంట్ ఇస్మాయిల్ ను విధుల్లో నుంచి తొలగించి ఎస్సీ,ఎస్టీ,అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ  స్టేట్ కౌన్సిల్ సభ్యుడు వెంకటాద్రి,ఆర్విఎఫ్,ఏఐ ఎఫ్బి,ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ రాయలసీమ యూనివర్సిటీ సూపర్డెంట్ ఇస్మాయిల్ 06-01-23 వతేదీ మధ్యాహ్న సమయంలో మద్యం సేవించి భారత రాజ్యాంగం నిర్మాత డా.బిఆర్.అంబేద్కర్ని అసభ్యకరమైన పదజాలములతో దూషిస్తూ,కులంపేర్లతో, దూశించి మాట్లాడటం చాలా బాధాకరమని, డా.బిఆర్.అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంను దేశ ప్రజలందరూ గౌరవిస్తుంటే,


రాజ్యాంగంలోని రిజర్వేషన్లతో ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తూ డా.బిఆర్.అంబేద్కర్ దుర్భాషలాడడం చాలా బాధాకరమని,వెంటనే విధులలో నుండి తొలగించాలని కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ సూపర్డెంట్  ఇస్మాల్  పైన పాణ్యం పోలీసుస్టేషన్ లో ఎస్సీ,ఎస్టీ,అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసారు.ఈ కార్యక్రమంలో దేవదత్తు, బత్తిని ప్రతాప్,రియాజ్, నాగరాజు,బాలసుంకన్న  తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: