కుల, మతీతాలకు ఆతీతంగా...
ఆళ్ళగడ్డ, కొర్రపోలురు గ్రామాల్లో ఘనంగా పీర్ల పండగ వేడుకలు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాలజిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలోని ఆళ్లగడ్డ మరియు కొర్రపోలురు గ్రామాల్లో కుల, మతాలకు అతీతంగా పీర్ల పండగ వేడుకలు ఘనంగా గ్రామస్తులు నిర్వహించారు. మౌలాలి స్వామి పీర్లకి గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు స్వామి వారికి ప్రత్యేక ఫాతిహాలు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారు. కుల, మత,బేద భావం లేకుండా గ్రామంలో ప్రతి ఒక్కరు మొహరం పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మౌలాలి స్వామి పీర్ల ను దర్శంచుకోవడానికి వచ్చిన భక్తులకు గ్రామ పెద్దల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మౌలాలి స్వామి పీర్ల ను ఏటికి తీసుకువెళ్లి పాతహాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆళ్ళగడ్డ, కోర్రపోలురు గ్రామ పెద్దలు, భారీ సంఖ్యలో మహిళలు, పిల్లలు, గ్రామప్రజలు పాల్గొన్నారు.
Home
Unlabelled
కుల, మతీతాలకు ఆతీతంగా... ఆళ్ళగడ్డ, కొర్రపోలురు గ్రామాల్లో ఘనంగా పీర్ల పండగ వేడుకలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: