మహేశ్వరం పాఠశాలలకు మహర్థశ

మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో నిధుల వరద

నియోజకవర్గంలోని విద్యాలయాలకు అధునాతన హంగులు

మన ఊరు మన బడి మొదటి విడతలో రూ.9 కోట్ల 13 లక్షల 62 వేల 800 రూపాయలు మంజూరు

హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

అడగనిదే అమ్మ అయిన అన్నం పెట్టదు అంటారు.... కానీ ఆడగకున్న అన్ని చేస్తూ నియోజకవర్గ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేస్తున్నారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు.ప్రతి రోజు ప్రజల మధ్యలో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకుంటూ,పరిష్కరిస్తూ సౌకర్యాలు కల్పిస్తూ మంత్రి ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 వేల పై చిలుకు పాఠశాలల్లో మొదటి విడత లో 9123 పాఠశాలలు అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.  కానీ మహేశ్వరం నియోజకవర్గములో ప్రత్యేకంగా మన ఊరు మన బడి లో మొదటి విడతలో ఎంపిక కానీ పాఠశాలలో ప్రత్యేక పనులకు 9 కోట్ల 13 లక్షల 62 వేల 800 రూపాయల భారీ నిధులు విడుదల చేయించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.


వాటిలో 87 పాఠశాలల్లో పెయింటింగ్ కు 2 కోట్ల 87 లక్షల 19 వేల 200 రూపాయలు, 83 పాఠశాలల్లో మైనర్ మరమ్మతులకు 2 కోట్ల 45 లక్షల 65 వేల 200 రూపాయల నిధులు, టాయిలెట్లకు 64 పాఠశాలల్లో  99 లక్షల 58 వేల 900 నిధులు, విద్యుత్, లైట్లకు 92 పాఠశాలల్లో ఒక కోటి 27 లక్షల 28 వేల 100 రూపాయలు, నల్లాల కనెక్షన్స్ కొరకు ఒక పాఠశాలలో 85 వేల నిధులు, 4 పాఠశాలలో అదనపు తరగతి గదుల కోసం 1 కోటి 53 లక్షల 6 వేల పై చిలుకు నిధులు మంజూరు అయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నియోజకవర్గము పై ఉన్న ప్రత్యేక శ్రద్దకు ఈ నిధులు నిదర్శనంగా నిలువనున్నాయి.

ఇది కదా అభివృద్ధి అంటే....ఇదే కదా సబితమ్మ మార్క్ పాలన అంటే......కుటుంభం లాగా మహేశ్వరం నియోజకవర్గము మొత్తం మీద పూర్తి అవగాహన ఉండి,ప్రజలను కుటుంబ సభ్యులుగా భావిస్తూ ముందుకెళ్తున్న సబితమ్మకు జనం నీరాజనాలు పలుకుతున్నారు.



 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: