సీఎస్ ను కలసిన తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ నేతలు
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియామకమైన శాంతి కుమార్ ను తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ నేతలు కలిశారు. ఈ సందర్భంగా కొత్త సీఎస్ శాంతి కుమార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతోపాటు కొత్తగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాభినందనలు కూడా అసోసియేషన్ నేతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర తహసీల్దార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.రాములు, సెక్రటరీ జనరల్ ఎస్ పీఆర్. మల్లేష్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ రాపాక రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: