అర్హులైన ప్రతి ఒక్కరు,,,కంటి వెలుగును ఉపయోగించుకోవాలి

చార్మినార్  జోన్ 9వ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సూర్య కుమార్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని జిహెచ్ఎంసి చార్మినార్  జోన్ 9వ సర్కిల్ పరిధిలోని అర్హులైన ప్రతి ఒక్కరు  సద్వినియోగం చేసుకోవాలని ఆ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సూర్య కుమార్ కోరారు. శాలిబండ డివిజన్ పరిధిలో ఓవైసీ కమ్యూనిటీ హాల్,  .రూప్ లాల్ బజార్ కమ్యూనిటీ హాల్,  గ్రీన్ విల్ అకాడమీ పాఠశాలలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మొగల్పురా డివిజన్ పరిధిలోని సుల్తాన్ షాహి మైదానం సమీపంలోని వార్డు కార్యాలయం. పురాణపుల్ డివిజన్ పరిధిలో పార్థివాడా కమ్యూనిటీ హాల్ ,జామి నిజామీయ యూనివర్సిటీ లోను. ఘాన్సీ బజార్ డివిజన్ పరిధిలో గులాబ్ సింగ్ బౌలీ కమిటీ హాల్ , పత్తర్ గట్టి డివిజన్ పరిధిలో దారిషిఫా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల,బాల్ చెట్టి మైదానం తదితర ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలనుఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమం చేపట్టిన కేంద్రాలలో  ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  జి హెచ్ ఎం సి తరపున అన్ని  ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కేంద్రాలలో నిష్టాతులైన డాక్టర్లు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని 18 సంవత్సరములు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరూ  ఉదయం 9:00 నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ కంటి వెలుగు కార్యక్రమాల్లో పాల్గొని ఉచిత కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని ఆయన కోరారు పరీక్షల కోసం వచ్చేవారు ఆధార్ కార్డు గాని రేషన్ కార్డు గాని తప్పనిసరిగా తీసుకురావాలని ఆయన కోరారు. వైద్య పరీక్షల అనంతరం అర్హులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: