జగనన్న ఇంటి నిర్మాణానికి రూ5 లక్షలు మంజూరు చేయాలి

సీపీఐ నేతల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గోస్పాడు మండలం శ్రీనివాసపురం గ్రామంలో సీపీఐ ఆధ్వర్యంలో జగనన్న కాలనీ సందర్శించి లబ్ధిదారులతో సంతకాల సేకరించి,మాట్లాడిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు,జిల్లా కార్యదర్శి రంగ నాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు రమేష్లు పోరుబాటకార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జనవరి 17 నుండి ఫిబ్రవరి 6 వరకు పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, జగనన్న ఇంటి నిర్మాణానికి ప్రస్తుతం ఇస్తున్న 1,80,000 ను 5 లక్షలకు పెంచాలని,రాష్ట్రంలో  జగనన్న కాలనీల పేరుతో నిర్మిస్తున్న కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పించలేదని, ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,


ప్రస్తుతం ఉన్న ధరలకు 1,80,000  ఏమాత్రం సరిపోదని,లబ్ధిదారులు అప్పులు చేసుకుని ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జగనన్న ఇళ్ల నిర్మాణాలు  త్వరితగతన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుందని, పట్టణాలలో ఇళ్ల స్థలాల కేటాయింపులో ప్రతి నిరుపేదకు రెండు సెంట్లు, గ్రామాలలో మూడు సెంట్లు ఇంటి స్థలాలు  కేటాయించాలన్నారు.  జగనన్న ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులతో 17నుండి ఫిబ్రవరి 22 వరకు సంతకాల సేకరణ చేపడుతున్నామని,ఫిబ్రవరి 6 న నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించబోతున్నామని,

ఫిబ్రవరి 22న విజయవాడలో రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహించడం  జరుగుతుందన్నారు. ఈ మహాధర్నా కార్యక్రమానికి నాయకులు,కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో గోస్పాడు మండల సీపీఐ  కార్యదర్శి హరినాథ్,సహాయ కార్యదర్శి గోకారి, AISF నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు సురేష్, మహిళా సమైక్య నాయకులు లక్ష్మీదేవి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: