తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు

నందమూరి తారక రామారావు.... 27 వ వర్ధంతి

ఘననివాళులర్పించిన టీడీపీ నేతలు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండల పరిధిలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరియు దుర్వేసి గ్రామంలో తెలుగుదేశం పార్టీ స్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి గడివేముల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేశం సత్యనారాయణ రెడ్డి, దుర్వేసి గ్రామంలో అంగజాల కృష్ణ యాదవ్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1982 మార్చి 29 తేదీన తెలుగుదేశం పార్టీని నిర్మించి తొమ్మిది నెలలోనే అధికారం చేపట్టి ప్రజల హృదయాలలో మన్నన పొందిన నందమూరి తారక రామారావు మూడుసార్లు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి నిరుపేదలకు రెండు రూపాయల కిలో బియ్యం, పేదలకు గృహాల పంపిణీ, మండల వ్యవస్థ ద్వారా ప్రజలకు పరిపాలనను దగ్గరకు చేసిన మహనీయుడని,


చలనచిత్ర రంగంలో పౌరాణిక,సాంఘిక చిత్రాలలో నటించి ఇప్పటికీ ప్రజల హృదయాలలో రాముడు,కృష్ణుడు అంటే ఇలానే ఉంటారా అనుకునే విధంగా చరిత్రలో నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి అని, ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా నేడు యువత ఉజ్వల భవిష్యత్తుకు న్నాందిగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా పార్లమెంటు అధ్యక్షులు గౌరు వెంకట రెడ్డి,పాణ్యం మాజీ శాసనసభ సభ్యురాలు గౌరు చరితారెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు కృషి చేస్తున్నామని తెలిపారు.

దుర్వేసి గ్రామంలో ఎన్టీఆర్ కు ఘననివాళ్లులర్పిస్తున్న టీడీపీ నేతలు

ఈ కార్యక్రమంలో గడివేముల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేశం సత్యనారాయణరెడ్డి, సీనియర్ నాయకులు సీతారామిరెడ్డి,ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగశేషులు, ముస్లిం మైనారిటీ అధ్యక్షులు గఫూర్, సర్పంచ్ రమణమ్మ, వాణిజ్య విభాగ సంఘం అధ్యక్షులు గణేష్ రెడ్డి,నారాయణరెడ్డి, అవ్వరు శ్రీకాంత్, బిసి నాయకుడు రాజు,దుర్వేసి గ్రామానికి చెందిన పాణ్యం బీసీ సెల్ అధ్యక్షులు అంగజాల కృష్ణ యాదవ్, శ్రీనివాస యాదవ్, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: